తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతిలో చేస్తున్న ఆందోళన పచ్చి బూటకం అని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విశాఖలో అన్నారు. అమరావతిలో తన బినామీ భూములను కాపాడుకొనేందుకే చంద్రబాబు దీక్ష చేస్తున్నారు తప్ప... రైతు మీద ప్రేమతో కాదని తెలిపారు. ఆయన స్వార్ధ ప్రయోజనం కోసం రైతులను, యువకులను రెచ్చగొట్టి ఉద్యమం పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారన్నారు. రైతులకు మద్దతు పేరుతో తెగ ఆర్భాటం చేస్తున్న ఆయన గత ఐదేళ్ల పాలనలో పూర్తి స్థాయి రాజధాని ఎందుకు నిర్మించలేక పోయారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 2 వేల 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆయన ఎందుకు రాజధాని కట్టలేకపోయారో అక్కడి రైతులకు సమాధానం చెప్పాలని అన్నారు. ఆయన నిజంగా రైతుల క్షేమం కోరే నాయకుడు అయితే ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని ఆహ్వానించారు. ఆయన సూచనలు ప్రజాసంక్షేమం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పక ఆచరిస్తుంది అని స్పష్టం చేశారు.
'చంద్రబాబు ఆందోళన పచ్చి బూటకం'
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అమరావతిలో చేస్తున్న ఆందోళన పచ్చి బూటకమని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విశాఖలో అన్నారు. ప్రజాసంక్షేమం సీఎం జగన్ నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు.
చంద్రబాబుపై దాడి వీరభద్రరావు వ్యాఖ్యలు