ETV Bharat / city

'మహిళలు కన్నీరు పెట్టే స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు' - సీఎం జగన్​పై లోకేశ్ విమర్శలు

ముఖ్యమంత్రి జగన్ మహిళలు కన్నీరు పెట్టుకునే స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని.. నారా లోకేశ్ మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను పోలీసుల చేత కొట్టిస్తున్నారని ఆరోపించారు.

lokesh fires on cm jagan
నారా లోకేశ్
author img

By

Published : Jan 10, 2020, 6:45 PM IST

lokesh fires on cm jagan
ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లోకేశ్​ ట్వీట్​

ముఖ్యమంత్రి జగన్ అక్కాచెల్లీ అంటూ పాదయాత్రలో పలకరించి.. ఇప్పుడు అదే అక్కాచెల్లీ కన్నీరు పెట్టే స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న మహిళలపై పోలీసులు ఎందుకు చేయి చేసుకున్నారని నిలదీశారు. ఒక్కో ఇంటి దగ్గర పది మంది పోలీసులా అంటూ ధ్వజమెత్తారు. దేశానికి అన్నం పెట్టే రైతంటే ముఖ్యమంత్రికి ఎందుకంత చులకనంటూ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

గళమెత్తిన మహిళా లోకం.. ఎక్కడికక్కడ అరెస్టులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.