Skill Development Corporation Case:ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నిధుల దుర్వినియోగం కేసులో ఆరెస్టయిన నిందితులను ఈడీ విచారణకు అనుమతిస్తూ న్యాయస్ధానం తీర్పునిచ్చింది. ఈనెల నాలుగున సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎండి వికాస్ వినాయక్ , పీవీఎస్పీఐటీ స్కిల్ సీఈవో ముకుల్ చంద్ అగర్వాల్, సారా చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రతినిధి సురేష్ గోయల్ లను ఈడి అరెస్ట్ చేసి విశాఖ కేంద్ర కారాగారానికి తరలించింది. తదుపరి విచారణ కోసం తమకు ఇవ్వాలని దాఖలుచేసిన పిటిషన్ పై విశాఖలోని ఎం.ఎస్.జే. కోర్టు జడ్జి ఎం తిరుమలరావు ఈనెల 10 న వాదోపవాదనలు విన్నారు. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయముర్తి సోమవారం తీర్పు వెలువరించారు. ఈడీ ఈ నలుగురిని 15 రోజుల కస్టడీకి కొరింది. ఏడు రోజుల కస్టడీకి మాత్రమే న్యాయస్ధానం అనుమతించింది. రేపటి నుంచి న్యాయవాది సమక్షంలోనే ప్రశ్నించాలని ఈడీని కోర్టు అదేశించింది. విచారణ సమయంలో పాటించాల్సిన నియనిబంధనలను కూడా న్యాయస్ధానం నిర్దేశించింది.
ఇదే అంశంపై కొనసాగుతున్న సీఐడీ విచారణ: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై టీడీపీ నేతలు సైతం ఘాటుగానే స్పందించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో అవతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ అధికారులు అప్పటి ఐఏఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ ను సైతం ఈ నెల 10వ తేదీన సీఐడీ విచారించింది.