ఆదివారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విశాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులకు సంబంధించిన ఫలితాలు ఒకేసారి వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
'అన్ని వార్డుల్లో ఒకేసారి కౌంటింగ్ జరిగేలా ఏర్పాట్లు' - ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు
విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అన్ని వార్డుల్లో ఒకేసారి ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశామని సబ్ కలెక్టర్ నారప రెడ్డి మౌర్య తెలిపారు.
నర్సీపట్నం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు
లెక్కింపు ప్రక్రియ ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని సబ్ కలెక్టర్ నారప రెడ్డి మౌర్య తెలిపారు. అన్ని వార్డుల్లో ఒకేసారి లెక్కించేలా ఏర్పాటు చేశామని మౌర్య వివరించారు. ఉదయం 11 గంటలకు తొలి ఫలితం ప్రకటించే అవకాశముందన్నారు.
ఇదీ చూడండి:ఏ మెుహం పెట్టుకుని ఓట్లు అడగుతారు?: సీపీఐ రామకృష్ణ