నర్సీపట్నం పట్టణంలోనే ఇప్పటివరకు ఏడుగురు వ్యక్తులకు కరోనా నిర్ధారణ అయింది. నియోజకవర్గంలోని మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం మండలాల్లోనూ మరో పది కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. రావికమతం, రోలుగుంట మండలాల్లో ఇప్పటివరకు ఐదు కేసులను గుర్తించారు. రావికమతం మండలం కొత్తకోటలో నమోదవుతున్న కేసులకు సంబంధించి… వ్యాపార సంస్థలకు షరతులు విధించారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే వ్యాపార వాణిజ్య సంస్థలు తెరవాలని పోలీసులు ఆదేశించారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో విస్తరిస్తున్న కరోనా - corona effect on narsipatnam
విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లోనూ విస్తరిస్తున్నాయి.
narsipatnam