విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామంలో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తి విశాఖ నగరంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. బాధితుని తల్లిదండ్రులు గ్రామంలో ఉండటం వల్ల రెండు, మూడు రోజులకు ఒకసారి తురువోలుకు వస్తుంటారు. శనివారం పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్‌ను పిచికారీ చేయించారు.
చీడికాడ మండలంలో కరోనా కలకలం
చీడికాడ మండలంలో ఓ కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపింది. బాధితుడు విశాఖలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. శనివారం కరోనా నిర్ధారణ అవ్వడం వల్ల ఆ పరిసర ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు.
తురువోలు గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు