వ్యవసాయ రంగానికి వెన్నుముక లాంటి సహకార సంఘాలకు సుమారు మూడేళ్ల నుంచి పూర్తిస్థాయి పాలకవర్గాలు లేవు. గతేడాది నవంబరు వరకు సహకార శాఖ అధికారులు, సిబ్బంది ఇన్ఛార్జ్లుగా వ్యవహరించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత... మాజీ ఛైర్మన్లు, డైరెక్టర్లను పర్సన్ ఇన్ఛార్జ్గా నియమించింది. ఈ ఏడాది జూన్లో గడువు ముగియగా... మరో ఆరు నెలలు పొడిగించింది. డిసెంబర్ 3న ఆ గడువు కూడా ముగిసింది. దీన్ని బట్టి పరిశీలిస్తే ఇప్పట్లో సహకార ఎన్నికలు నిర్వహించే సూచనలు లేకపోవడంతో... మూడోసారి కూడా పొడిగింపునకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సహకార వర్గాల సమాచారం.
ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరి 19 ప్రాథమిక సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్లకు ఎన్నికలు జరిగాయి. 2018 ఫిబ్రవరిలో ఆయా సంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగియటంతో... అప్పటి ప్రభుత్వం ఆయా సంఘాల కార్యదర్శులు, సీఈవోలకు పూర్తి బాధ్యతలు అప్పగించింది.