ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపివేయాలి'

By

Published : Mar 2, 2021, 5:02 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అంశాన్ని ఆపివేయాలని కోరుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీలను ప్రైవేటీకరిస్తే.. రిజర్వేషన్లు పొందే వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. 'విశాఖ ఉక్కు మన హక్కు' అని పోరాటం చేస్తామని ఆయన లేఖలో పేర్కొన్నారు.

v.hanmantharao wrote a letter to pm modi on vishaka steel plant privatisation issue
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపివేయాలని కోరుతూ ప్రధానికి వీహెచ్ లేఖ

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసే ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. ఉక్కు ఉత్పత్తి కోసం అవసరమైన ఇనుప ఖనిజం అందుబాటులో ఉందని.. అలాంటి పరిశ్రమను ప్రవేటుపరం చెయ్యాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు మా హక్కు అని పోరాటం చేస్తామని లేఖలో పేర్కొన్నారు.

2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఉన్నవి తొలగిస్తున్నారు

ప్రభుత్వ రంగ సంస్థలను, యూనివర్సటీలను ప్రైవేట్ పరం చేస్తే.. రిజర్వేషన్లను పొందే వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ.. ఉన్న ఉద్యోగాలు కూడ తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే అది చేస్తున్నారని, దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 'విశాఖ ఉక్కు మా హక్కు' అని పోరాటం చేస్తామని వీహెచ్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

స్టీల్ పాంట్ల్ ఉద్యోగుల భవిష్యత్ కోసం కేంద్రం ఆలోచిస్తోంది: ఎంపీ జీవీఎల్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details