చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)ను రద్దు చేయాలని విశాఖలో పౌర ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వారిని ఉపా చట్టం కింద ఏళ్ల తరబడి జైల్లో పెడుతున్నారని సంఘం నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
'యూఏపీఏ చట్టాన్ని రద్దు చేయండి' - agitationfor repeal of UAPA Act news
యూఏపీఏ (ఉపా) చట్టం అమాయకులను అన్యాయంగా శిక్షించేలా ఉందని.. ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పౌర ప్రజా సంఘాలు విశాఖలో ఆందోళన చేపట్టాయి. ఈ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని కోరారు.
ఆందోళన నిర్వహిస్తున్న పౌర ప్రజాసంఘాలు
ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిపై అన్యాయంగా యూఏపీఏ చట్టాన్ని ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కులు, స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉపా చట్టం ఉందని..వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం కింద అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: విశాఖలో స్టోన్ క్రషర్కు రూ.10కోట్ల జరిమానా