విశాఖ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం నిరసన తెలియజేస్తున్న కార్మికుల వేతనాల్లో కోత విధించడం దారుణమని, ఇది రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యని సీఐటీయూ విశాఖ నగర అధ్యక్షుడు ఆర్కేఎస్వీ కుమార్ అన్నారు.
'నిరసన తెలిపిన వారి వేతనాల్లో కోత విధించటం దారుణం' - citu protest at vishaka rtc office
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) పరిరక్షణ కోసం నిరసన తెలియజేస్తున్న కార్మికుల వేతనాల్లో కోత విధించడం దారుణమని సీఐటీయూ విశాఖ నగర అధ్యక్షుడు అన్నారు. విశాఖ రీజినల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు.
కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం డీజిల్ పై పన్నులు పెంచి ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీపై పెను భారం మోపిందని కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టీసీని మరింత కష్టాల్లోకి నెడుతున్న డీజిల్ భారాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కాలంలో హైర్ బస్సుల సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అనంతరం కార్మికుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పర్సనల్ అధికారికి సమర్పించారు. నిరసన కార్యక్రమంలో సీఐటియూ జోనల్ కమిటీ అధ్యక్షుడు కృష్ణారావు, కుమారి, ఏ. సింహాచలం పి. వెంకట్రావు పాల్గొన్నారు.
ఇది చదవండినిరాడంబరంగా తొలి ఏకాదశి పూజలు