విశాఖ జిల్లా కసింకోట మండలం తీడ గ్రామంలో ఆటోలో తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాను.. అనకాపల్లి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాళ్లపాలెంకు చెందిన కర్రి చందర్రావు, గళ్ల అప్పారావును అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ ఉపేంద్ర తెలిపారు. ఆటోను సీజ్ చేసినట్లు చెప్పారు.
ఆటోలో తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారా స్వాధీనం - cheap liquor caught by police at anakapalli
లాక్డౌన్ కారణంగా నేపథ్యంలో మద్యం దుకాణాలు తెరుచుకోవట్లేదు. ఈ నేపథ్యంలో నాటుసారా తయారీ, రవాణా ఊపందుకుంది. శివారు ప్రాంతాల్లో నాటుసారా తయారుచేస్తూ రవాణా చేస్తున్నారు. వారిని పోలీసులు ఎప్పటికప్పుడు పట్టుకుంటూనే ఉన్నారు.
![ఆటోలో తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారా స్వాధీనం cheap liquor caught by police at anakapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6762846-1050-6762846-1586686946438.jpg)
ఆటోలో తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారా స్వాధీనం