విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం లుగసారిపుట్టులో పోలీసులు డ్రోన్ కెమెరాలతో.... సుమారు 80 ఎకరాల్లో నాలుగు లక్షల గంజాయి మొక్కలను గుర్తించారు. వాటిని ధ్వంసం చేశారు. గంజాయి తోటల ధ్వంసం కార్యాచరణలో ఇప్పటివరకు ఇదే పెద్ద ఆపరేషన్ అని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. ఈ దాడుల్లో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, రెవెన్యూ, అటవీ సిబ్బంది, కూలీలు 80 మంది వరకు పాల్గొన్నారు. గ్రామస్తులు ఎదురుతిరిగినా వారిని సముదాయించి గంజాయి తోటలు ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు 12 నుంచి 14 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. దాడులు మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు.
విశాఖ మన్యంలో... 4 లక్షల గంజాయి చెట్లు ధ్వంసం - విశాఖ మన్యంలో భారీగా గంజాయి తోటలు ధ్వంసం
విశాఖ మన్యం పెదబయలు మండలంలో భారీగా గంజాయి చెట్లను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. ఇదే విధంగా మన్యంలో అన్ని చోట్ల దాడులు ముమ్మరం చేస్తామని తెలిపారు.

విశాఖ మన్యంలో భారీగా గంజాయి ధ్వంసం