కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటు కోసం అన్ని పక్షాలూ కలిసిరావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా కంచరపాలెంలో నర్సింగరావు ఫౌండేషన్ భవనాన్ని ప్రారంభించారు. చంద్రబాబు, కాంగ్రెస్ నేతృత్వంలో.. కేసీఆర్ మిగిలిన పక్షాలను కలుపుకుని కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అయితే ఇవి పరోక్షంగా కమలం పార్టీకే అనుకూలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ వైరుధ్యాలను అధిగమించేలా వామపక్షాలు చొరవ తీసుకుంటున్నాయని చెప్పారు. బెంగాల్లో భాజపా, తృణమూల్ కాంగ్రెస్ రెండూ మత వైరుధ్యాలను రెచ్చగొట్టి తాము లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు.
కేంద్రంలో లౌకిక ప్రభుత్వం: బీవీ రాఘవులు - media
కేంద్రంలో లౌకిక ప్రభుత్వం ఏర్పాటవుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా వామపక్ష పార్టీలు చొరవ తీసుకుంటున్నాయని తెలిపారు.
బీవీ. రాఘవులు
ఇవీ చదవండి..