దేశంలోనే తొలిసారిగా బీఎస్ఎన్ఎల్ ఒక ప్రైవేటు భాగస్వామితో కలసి ట్రిపుల్ ప్లే సర్వీసులను త్వరలోనే విశాఖలో అందిస్తోందని.. బీఎస్ఎన్ఎల్ డైరక్టర్ వివేక్ బంజాల్ వెల్లడించారు. విశాఖలోని ఎస్డీవీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వినియోగదార్లకు మంచి సేవలను అందించటం, వేగంగా కనెక్షన్లు ఇవ్వడం వంటి వాటిపై సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా చూడాలని సూచనలు ఇచ్చారు. ఫోన్- నెట్- కేబుల్ సర్వీసులు ఒకే ప్యాకేజిలో అందిస్తున్నామని వివేక్ చెప్పారు. ఆరు జిల్లాల్లో ఆరు లక్షల మంది వినియోగదార్లకు ఎస్డీవీతో కలిసి ట్రిపుల్ ప్లే సర్వీసులు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇందుకు కావాల్సిన సాంకేతిక సహకారం అంతా బీఎస్ఎన్ఎల్ అందిస్తోందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఈ మోడల్ విజయవంతం అవుతుందని రాష్ట్ర టెలికాం సర్కిల్ సీజీఎం వీవీఎస్ రాఘవ కుమార్ వివరించారు. వినియోగదార్లందరికి ఉపయుక్తంగా ఈ ప్యాకేజిని తీర్చిదిద్దామని ఎస్డీవీ ఛైర్మన్ ఇసుకపల్లి రామకృష్ణంరాజు తెలిపారు.
ఇదీ చదవండి:
త్వరలోనే... విశాఖలో బీఎస్ఎన్ఎల్ ట్రిపుల్ ప్లే సర్వీసులు - విశాఖలో బీఎస్ఎన్ఎల్ ట్రిపుల్ ప్లే సర్వీసులు
దేశంలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి బీఎస్ఎన్ఎల్ ట్రిపుల్ ప్లే సర్వీసులను ప్రారంభించనుందని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ వెల్లడించారు. త్వరలోనే విశాఖలో ప్రారంభం కానున్న ఈ సర్వీసులకు సంబంధించిన అంశాలపై సంస్థకు సంబంధించిన పలువురు అధికారులు చర్చించారు.
విశాఖలో బీఎస్ఎన్ఎల్ ట్రిపుల్ ప్లే సర్వీసులు