ETV Bharat / city

గిరిజన సంప్రదాయంలో జాయింట్ కలెక్టర్ దంపతుల పెళ్లి - అరకులో జాయింట్ కలెక్టర్ దంపతులకు పెళ్లి

అరకు గ్రామదర్శినిలో జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ దంపతులకు వివాహం జరిపించారు గిరిజనులు. గిరిజన సంప్రదాయాల ప్రకారం వివాహం చేశారు. ఈ వివాహాన్ని జేసీ శివశంకర్‌ బంధువులు, పర్యటకులు తిలకించారు. ఇలా వివాహం చేసుకోవడం కొత్త అనుభూతి కలిగించిందని శివశంకర్‌ దంపతులు చెబుతున్నారు.

jc-tribal-marriage-in-araku
jc-tribal-marriage-in-araku
author img

By

Published : Jan 18, 2020, 9:28 AM IST

గిరిజన సంప్రదాయంలో జాయింట్ కలెక్టర్ దంపతులకు పెళ్లి

విశాఖ జిల్లా అరకులోయ గిరి గ్రామదర్శిని కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివశంకర్ దంపతులకు గిరిజనులు తమ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిపించారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం జేసీ దంపతులను సిద్ధం చేసి వివాహం చేశారు. గిరిజన ఆచారాలు, సంప్రదాయాలు పర్యటకులకు తెలియజేసేందుకు ఈ వివాహం చేసుకున్నామని జాయింట్ కలెక్టర్ శివశంకర్ తెలిపారు. ఈ వివాహాన్ని జేసీ శివశంకర్ బంధువులు, పర్యటకులు ఆనందంగా తిలకించారు. ఇలా వివాహం చేసుకోవడం కొత్త అనుభూతి కలిగించిందని జేసీ తెలిపారు.

Intro:విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ పెళ్లికొడుకయ్యాడు ఏవండోయ్ ఈ వయసులో ఆయనకు పిల్లని ఆశ్చర్యపోతున్నారా కాదండి ఇది నిజం పెళ్లి కాదు ఉత్తుత్తి పెళ్లి అరకు లోయలోని గిరిజన గ్రామదర్శిని లో జెసి శివశంకర్ దంపతులకు గిరిజన సంప్రదాయ ప్రకారం వివాహం జరిపించారు పర్యాటకులకు గిరిజన ఆచారాలు సంప్రదాయాలు కళ్లకు కట్టేలా స్వయంగా వారే ఆ అనుభూతిని పొందేలా గిరి గ్రామదర్శిని లో వివాహ ఏర్పాట్లు చేశారు ఇందులో భాగంగానే గిరిజన సంప్రదాయం ప్రకారం శివశంకర్ దంపతులకు మేళతాళాలతో వివాహం జరిపించారు గిరిజన సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు పెళ్లి కొడుకు గిరిజన సంప్రదాయ దుస్తులను అలంకరింప చేశారు ఆభరణాలని వేశారు అనంతరం గిరిజన సంప్రదాయం ప్రకారం పూజారి పెళ్లి తంతు పూర్తి చేశాడుBody:వధూవరులను కళ్యాణమండపానికి తోడ్కొని వచ్చి వేదమంత్రాల నడుమ మూడు ముళ్ళు వేసి బంధానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగానే వధూవరులు గిరిజన సంప్రదాయ కిచిడి ని ఒకరికొకరు తినిపించుకున్నారు ఇరువురి కాళ్ళు పాదాలతో మట్టించుకున్నారు. అనంతరం బిందెలో ఉంగరాన్ని వెతకడం కోసం వధూవరులు పోటీ పడ్డారుConclusion:గిరిజన సంప్రదాయ వివాహ మహోత్సవ అని అక్కడికి వచ్చిన పర్యాటకులు జెసి శివశంకర్ బంధువులు ఆనందంగా తిలకించారు గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం తనకు కొత్త అనుభూతులు మిగిల్చిందని జెసి దంపతులు పేర్కొన్నారు గిరి గ్రామదర్శిని పర్యాటకులు సందర్శించారు మంచి ప్రాంతమని ఆయన కితాబిచ్చారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.