విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని కోనాం గ్రామస్థులు కొందరు... కోనాం జలాశయం అవతల వైపు కొండకు వంటచెరుకు కోసం మంగళవారం నాటుపడవలపై వెళ్లారు. పుల్లలు వేసుకుని తిరిగి వస్తుండగా పడవ గాలికి బోల్తా పడింది. దీంతో సిరవరపు కళ్యాణం(40) అనే వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. బుధవారం కుటుంబసభ్యులు చీడికాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కోనాం జలాశయంలో పడవ బోల్తా.. వ్యక్తి గల్లంతు - Boat capsizes in Konam Reservoir a person missed
విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని కోనాం జలాశయంలో నాటుపడవ బోల్తా పడింది. ఓ వ్యక్తి జలాశయంలో గల్లంతయ్యాడు.
కోనాం జలాశయంలో పడవ బోల్తా.. వ్యక్తి గల్లంతు