ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ భూదందాలపై సిట్ నివేదికలు బయటపెట్టాలి: జీవీఎల్‌

BJP MP GVL COMMENTS : విశాఖలో భూఅక్రమాలపై సిట్‌ నివేదికలను బయటపెట్టాలని భాజపా ఎంపీ జీవీఎల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ భూభాగోతాలపై తాను రాసిన లేఖ వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఆయన అన్నారు. విశాఖ భూదందాల్లో వైకాపా, తెదేపా నేతల పాత్ర ఉందన్న జీవీఎల్‌.. తగిన చర్యలు తీసుకునే వరకూ భాజపా పోరాడుతుందన్నారు.

bjp mp gvl
bjp mp gvl

By

Published : Oct 30, 2022, 2:52 PM IST

BJP MP GVL COMMENTS : విశాఖలో భూదందాలపై సిట్​ నివేదికలను బహిర్గతం చేయాలని భాజపా ఎంపీ జీవీఎల్ డిమాండ్​ చేశారు. విశాఖ భూ భాగోతాలపై అక్టోబర్ 11న గవర్నర్​కు లేఖ రాసినట్టు చెప్పుకొచ్చారు. విశాఖలోని భాజపా కార్యాలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 22ఏ కింద ఉన్న భూముల విషయాలపై నిర్ణయం తీసుకోమని లేఖలో కోరినట్లు తెలిపారు. భాజపా ఒత్తిడి వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని పేర్కొన్నారు. సిట్ రిపోర్ట్స్ బయట పెట్టకపోతే ఎవ్వరినీ వదలమని హెచ్చరించారు. విశాఖ భూదందాలో తెదేపా, వైకాపా నేతల పాత్ర ఉందని ఆరోపించారు.

SOMU COMMENTS: విశాఖలో భూదందాలకు పాల్పడ్డ వారిపై తెదేపా, వైకాపాలు సిట్ వేసి.. నివేదికలు బహిర్గతం చేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. నిందితులతో రెండు పార్టీలు కుమ్మక్కవడం వల్లే నివేదికలు బయటకు రాలేదని ఆరోపించారు. విశాఖలో పవన్‌ కల్యాణ్‌పై ప్రభుత్వ తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో పవన్ కల్యాణ్‌ను కలిసి సంఘీభావం తెలిపామని.. ఈ ఘటనపై భాజపా అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు.

విశాఖ భూదందాలపై.. సిట్ నివేదికలు బయటపెట్టకపోతే ఎవరినీ వదలబోము

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details