ఇటు చంద్రబాబు... అటు జగన్... తమ పార్టీల వాణిని జనాల్లోకి తీసుకెళ్లి.. రాష్ట్రవ్యాప్తంగా జనాన్ని ఆకర్షించేందుకు విశాఖ జిల్లానే ఎంచుకోవడంపై.. అన్ని వర్గాలు ఆసక్తిని చూపిస్తున్నాయి. అధినేతలు హాజరయ్యే సభలు కావడం.. సార్వత్రిక ఎన్నికలకు సమయమూ అంతగా లేకపోవడంపై ఇరు పార్టీల అగ్ర నాయకులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక్కడి నుంచే...
తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ నగరంలోని మురళీనగర్ వద్దనున్న మైదానంలో తెదేపా సభకు హాజరుకానున్నారు. అదే సమయంలో.. మంత్రి అయ్యన్నపాత్రుడు నియోజకవర్గం నర్సీపట్నం శ్రీకన్య థియేటర్ ప్రాంగణంలో వైకాపా అధ్యక్షుడు జగన్... బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ రెండు సభలతో.. తెదేపా, వైకాపా.. తమ ప్రచారాన్ని మరింత విస్తృతం చేసే దిశగా కసరత్తు చేస్తున్నాయి.
రోజులో 3 సభలు..
విశాఖ సభ అనంతరం.. రోజుకు 3 బహిరంగ సభల్లో పాల్గొనేట్లు అధినేతలిద్దరూ ప్రణాళికలు తయారు చేసుకున్నారు. సభలకు మధ్యాహ్న సమయాన్నే ఎంచుకోవడం విశేషం. సమావేశాల సమయానికి విశాఖ జిల్లాకు చెందిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఇరు పార్టీలు పూర్తి చేసేనా కసరత్తు చేస్తున్నాయి. బరిలో నిలిచేది ఎవరో తేలితే... జనసమీకరణ భారీగా చేసేందుకూ వీలుంటుందని