హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వైకాపా పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. అంతర్వేదిలో రథాన్ని పిచ్చోడు తగలబెట్టారనటాన్ని తప్పుబట్టారు. సింహాచలం దేవస్థానం ఆస్తులు, భూములను విజయసాయి రెడ్డి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కొండపై ఉన్న గ్రావెల్‌ను అమ్మేశారనీ.. సింహాచలం దేవస్థానం చైర్మన్ అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. విజయసాయి రెడ్డికి ఛైర్మన్ బినామీ అని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సింహాచలం భూముల్లో గ్రావెల్, ఇసుకను ఏపీఎండీసీకి అమ్మేశారనీ, అమ్ముకోవడానికి అవేమన్నా వారి సొంత ఆస్తులా అని నిలదీశారు. నిర్ణయాలన్నీ ఛైర్మన్ తీసుకుంటే ఇక బోర్డు సభ్యులెందుకని ప్రశ్నించారు. దేవాలయ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడం సరికాదన్నారు. వైకాపా ప్రభుత్వం మత సామరస్యం పాటించాలని హితవు పలికారు.
విజయసాయి రెడ్డికి... సింహాచలం దేవస్థానం ఛైర్మన్ బినామీ: అయ్యన్న - ayyanna pathrudu on ycp govt
వైకాపా ప్రభుత్వ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని.. తెదేపా నేత అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. సింహాచలం దేవస్థానం ఆస్తులు, భూములను విజయసాయిరెడ్డి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
అయ్యన్న