ప్రజలు తమ కలలను నిజం చేసుకునేందుకు గత సంవత్సరం ఇదే రోజున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వైకాపా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భీమిలిలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై... జగన్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు.
'ఏపీని అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేయటమే జగన్ లక్ష్యం'
వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేయాలని సీఎం జగన్ పనిచేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఏడాది కాలంలో ఇచ్చిన హామీలనే కాకుండా అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు.
'ఏపీని అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేయటమే జగన్ లక్ష్యం'
ఇచ్చిన హామీలనే కాకుండా అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేయడమే కాకుండా కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా రూపొందిస్తున్నారన్నారు. సీఎం జగన్పాలనలో అర్హులైన వారందరికీ పథకాలు అందుతున్నాయని వివరించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులను సీఎం జగన్ పెద్ద మనసుతో ఆదుకున్నారని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేయాలని సీఎం జగన్ పనిచేస్తున్నారని వివరించారు.