ఇవీ చదవండి:
పాడేరు: ఆటో బోల్తా ఘటనలో... మరొకరు మృతి - పాడేరు ఆటోబోల్తా ఘటనలో... మరొకరు మృతి
విశాఖ మన్యం పాడేరులో సోమవారం జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడిన పది మందిలో మరొకరు ఇవాళ మృతి చెందారు. పెదబయలు మండలం అరడకోట వద్ద ఎదురుగా వస్తున్న జీపును తప్పించబోయి.. 30 అడుగుల పై నుంచి వాగులో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందగా...పది మందికి గాయాలయ్యాయి. తాజాగా మృతుల సంఖ్య రెండుకు చేరింది. చుట్టుమెట్ట-పెదబయలు మార్గంలో రహదారి అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
పాడేరు ఆటోబోల్తా ఘటనలో... మరొకరు మృతి