ETV Bharat / state

కళ్లలో కారం కొట్టి... మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నం - ఉదయగిరిలో మహిళ మెడలోని బంగారం గొలుసు చోరీకి యత్నం

గుర్తు తెలియని వ్యక్తి.. మహిళ కళ్లలో కారం కొట్టాడు. ఆమె మెడలోని బంగారపు గొలుసు చోరీకి యత్నించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో జరిగింది.

The gold chain in the woman's neck tried to steal
ఉదయగిరిలో మహిళ మెడలోని బంగారం గొలుసు చోరీకి యత్నం
author img

By

Published : Jan 22, 2020, 11:53 AM IST

ఉదయగిరిలో మహిళ మెడలోని బంగారం గొలుసు చోరీకి యత్నం

నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో గుడికి వెళ్లిన మహిళ కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని వ్యక్తి బంగారపు గొలుసు చోరీకి ప్రయత్నించాడు. ఆరు సవర్ల బంగారు గొలుసులో సగం కంటే ఎక్కువ భాగాన్ని దుండగడు లాక్కొని పరారయ్యాడు. ఉదయగిరిలోని స్టేట్ పేట కాలనీలో నివాసముండే భోగి రెడ్డి రమణమ్మ ఐదేళ్లుగా విద్యుత్ కేంద్రం వద్ద ఉండే నాగారప్పమ్మ ఆలయం వద్ద ప్రతి రోజు పూజలు చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గుడి వద్ద పూజలు చేస్తుండగా... గుర్తు తెలియని వ్యక్తి వెనక వైపు నుంచి వచ్చి రమణమ్మ మెడలోని బంగారపు గొలుసు లాగే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె పెద్దగా కేకలు వేయగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. చివరికి ఆమె కళ్లలో కారం కొట్టిన దుండగుడు.. గొలుసులోని కొంత భాగాన్ని తెంపి లాక్కుని పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు ఎస్సై ముత్యాలరావు తెలిపారు.

ఇవీ చదవండి:

ఎట్టకేలకు దొంగ అరెస్టు.. బంగారం, నగదు స్వాధీనం

Intro:కళ్లలో కారం కొట్టి... మహిళ మెడలో చోరీ యత్నం
సరుడులో కొంత భాగాన్ని లాక్కొని పరారైన గుర్తుతెలియని వ్యక్తి

Body:గుడి వద్ద పూజ చేసుకునేందుకు వెళ్లిన మహిళా కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని వ్యక్తి సరుడు చోరీకి ప్రయత్నించిన సరుడులో కొంత బంగారాన్ని లాక్కొని పరారైన ఘటన ఉదయగిరి పట్టణ శివారు ప్రాంతంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద జరిగింది. ఉదయగిరి లోని స్టేట్ పేట కాలనీ లో నివాసముండే భోగి రెడ్డి రమణమ్మ ఐదేళ్లుగా విద్యుత్ కేంద్రం వద్ద ఉండే నాగారప్పమ ఆలయం వద్ద ప్రతి రోజు పూజలు చేస్తూ ఉండేది. అదే క్రమంలో మంగళవారం సాయంత్రం గుడి వద్ద పూజలు చేసేందుకు రమణమ్మ వెళ్ళింది. పూజ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనకవైపు నుంచి వచ్చి రమణమ్మ మెడలో సరుడు లాగే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె పెద్దగా కేకలు వేయడంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమె కళ్లలో కారం కొట్టి సరుడులో కొంత భాగం బంగారాన్ని లాక్కుని పారిపోయాడు. వెంటనే ఆమె తేరుకొని పక్కనే ఉండే కాలనీ వద్దకు వెళ్లి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ముత్యాలరావు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరారైన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో బాధితురాలితో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. బాధితురాలు రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యాలరావు తెలిపారు.

Conclusion:బైట్ : రమణమ్మ, బాధితురాలు

రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ : 8008573944

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.