ఆంధ్రా-ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి నిల్వలు, నీటి వాడకంపై ఇరు రాష్ట్రాల అధికారులు సమీక్ష నిర్వహించారు. ఎగువ ప్రాంతాలు నుంచి వచ్చే నీటిని నిల్వచేసుకుని.. పొదుపుగా వాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 42.17 టీఎంసీలు, జోలాపుట్‌లో 19.75 టీఎంసీలతో మొత్తం 61.92 టీఎంసీల నీరుండగా.. నదీ పరివాహక ప్రాంతాల నుంచి సుమారు 1.58 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
Balimela reservoir: బలిమెల జలాశయం నీటి వాడకంపై.. ఆంధ్రా-ఒడిశా అధికారుల సమీక్ష
ఆంధ్రా-ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వాడకంపై ఇరు రాష్ట్రాల అధికారులు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతానికి నీటి అవసరాల కోసం ఏపీ 500 క్యూసెక్కులు, ఒడిశా 2500 క్యూసెక్కుల నీటిని బలిమెల జలాశయం నుంచి వాడుకోవాలని నిర్ణయించారు.
review
ఇందులో ఏపీ జెన్కో 22.58 టీఎంసీలు .. ఒడిశా 40.92 టీఎంసీల నీరు వాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత అవసరాల కోసం ఏపీ 500 క్యూసెక్కులు, ఒడిశా 2500 క్యూసెక్కుల నీటిని బలిమెల జలాశయం నుంచి వాడుకోవాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి