Andhra Medical College Centenary Celebrations: విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాల (Visakhapatnam AMC) శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 27, 28, 29 తేదీలలో శతాబ్ది ఉత్సవాలను ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల కమిటీ నిర్వహిస్తోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ హాజరు కానున్నారు.
వందేళ్ల ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల ఛైర్మన్ డాక్టర్ రవిరాజ్ మాట్లాడుతూ.. దేశంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల అతి పురాతనమైన మెడికల్ కాలేజ్ అని చెప్పారు. 1923లో విశాఖలో ఆంధ్ర మెడికల్ ప్రారంభించారని.. దేశంలో ప్రధానమైన మెడికల్ కళాశాలలో ఆంధ్ర మెడికల్ కళాశాల ఒకటని కొనియాడారు.
ISO CERTIFICATION: విశాఖ ఆంధ్రా వైద్య కళాశాలకు ఐఎస్‌ఓ ధృవీకరణ
ఎంతో మంది ప్రముఖు డాక్టర్లు ఆంధ్ర మెడికాల్ కళాశాలలో చదువుకున్నారని అన్నారు. ఉత్సవాలకు 3 వేల మంది పూర్వ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. పూర్వ విద్యార్థుల సౌజన్యంతో నిర్మించిన నూతన భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి చేతులు మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. వైద్య కళాశాల పక్కనే 1.6 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం భవనం కోసం కేటాయించిందని తెలిపారు. పూర్వ విద్యార్థుల నుంచి సేకరించిన విరాళాలతో సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో భవన నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆంధ్ర మెడికల్ కళాశాలలో 365 పీజీ సీట్లు ఉన్నాయి. శతాబ్ది ఉత్సవాలకు విదేశాలు నుంచి పూర్వ విద్యార్థులు హాజరవుతున్నారు. 27వ తేదీన కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు హాజరవుతున్నారు. 28వ తేదీన ఉత్సవాలకు భారత ఉపరాష్ట్రపతి ముఖ్య అతిధిగా హాజరు అయ్యి అనేక ప్రారంభోత్సవాలు చేస్తారని కమిటీ చెప్పింది. అలాగే ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పథకాలు అందించడంతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వందేళ్ల వేడుకలో నిర్వహిస్తున్నట్లు కమిటీ చెప్పుకొచ్చింది.
ఆంధ్ర వైద్య కళాశాల.. వివిధ రాష్ట్రాల విద్యార్థులకు వేదిక!
ప్రారంభోత్సవ సభ ఏఎంసీ ఆవరణలో జరుగుతుందని, మిగిలిన మూడు రోజులు ఆంధ్రా యూనివర్సిటీ కాన్వొకేషన్ సెంటర్‌లో కార్యక్రమం జరుగుతుందని కమిటీ తెలిపింది. ఏఎంసీ ఉత్సవాల్లో మ్యూజికల్ కార్యక్రమాలు, పూర్వ విద్యార్థులచే స్కిట్‌లు ఉంటాయని కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరాజు తెలిపారు. 1923 జూలై 19న 32 మంది విద్యార్థులతో కళాశాల ప్రారంభమైందని.. ఇది 1950 నాటికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారిందని అన్నారు. దేశంలోని ఏడు పురాతన కళాశాలల్లో ఆంధ్ర మెడికల్ కాలేజీ ఒకటి. ఈ కళాశాలలో చదివిన వారు దేశ విదేశాల్లో స్థిరపడి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పైలాన్‌ను కూడా ఆవిష్కరిస్తారని, దేశంలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయని, వాటిలో ఏఎంసీ కూడా ఒకటని అన్నారు.