ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 20, 2021, 12:52 PM IST

ETV Bharat / state

'హెచ్​పీసీఎల్​ ఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు'

విశాఖ హెచ్​పీసీఎల్​లో ఘటనలో అమాయక కార్మికులు ప్రాణాలు పోతున్నాయని ఏఐటీయూసీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూతూమంత్రంగా కమిటీని వేయడం.. కమిటీ నివేదిక వచ్చిన తరువాత చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

aituc contract labor union leader
ఏఐటీయూసీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ

విశాఖ హెచ్​పీసీఎల్​లో తరచూ జరుగుతున్న ప్రమాదాలపై స్థానిక ప్రజలు భయాందోళనలతో ఉన్నారని ఏఐటీయూసీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ స్థాపన నుంచి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని.. ఈ ఘటనలో అమాయకులు ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరుస ప్రమాదాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తూతూమంత్రంగా కమిటీని వేయడం కమిటీ నివేదిక వచ్చిన తరువాత చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకులదే తప్పని ఆ కమిటీలు తేలుస్తూ వస్తుందన్నాయని మండిపడ్డారు.

ఇతర రాష్ట్రాల నుంచి అతి తక్కువ జీతాలకు కార్మికులను తీసుకురావడం.. వారికి కనీస భద్రత లేకుండాపనులు అప్పచెప్పడం యాజమాన్యానికి అలవాటైపోయిందని ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించకుండా బయట వారికి ఉద్యోగాలు కల్పించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. హెచ్​పీసీఎల్ నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి మొండి చేయి చూపారని.. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడ వారు జీవిస్తున్నారని అన్నారు. ఇకమీదట ఇలా జరగకుండా అఖిలపక్షం, కార్మిక సంఘాలతో కలిసి హెచ్​పీసీఎల్​పై పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details