విశాఖ జిల్లా చీడికాడ మండలం లింగభూపాలపట్నం పొలాల్లో పిచ్చుకలు ఏర్పాటు చేసుకున్న గూడులు ఆకట్టుకుంటున్నాయి.విద్యుత్ తీగలకు,తాడి చెట్లకు వేలాడుతూ,వీచే గాలికి ఉయ్యాలలా ఊగుతూ చాలా ఆకర్షణగా ఉన్నాయి.సాయంత్రం వేళ పిచ్చుకులు కిచ్ కిచ్ అంటూ చేస్తున్న సందడితో పరిసర ప్రాంతాలు కోలాహలంగా ఉంటున్నాయి.దారిన పోయోవారు ఎంత పనిలో ఉన్నా,ఆ గూళ్లపై ఓ లుక్ వేసి మరీ సేద తీరుతున్నారు.
ఆకట్టుకుంటున్న పిచ్చుక గూళ్లు - linga bhupalapatnam
విశాఖక జిల్లా చీడికాడ మండలం లింగభూపాలపట్నం రహదారులపై ప్రయాణించే వారు..కిచ్ కిచ్ మంటూ సందడి చేసే ఈ పిచ్చుకలను, వాటి గూళ్లను చూడక మానరు. కాస్త సేద తీరక ఉండలేరు.
పక్షి గూళ్ల కనువిందు