తీవ్ర అల్పపీడనం గురువారం వాయుగుండంగా మారింది. పశ్చిమమధ్య బంగాళా ఖాతాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలవైపు కదులుతూ వెళ్తోందని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది శుక్రవారం ఉదయం లోపు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఇదే తీవ్రతతో మధ్యాహ్నం పశ్చిమబెంగాల్ లోని సాగర్‌దీవులు, బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా మధ్య సుందర్‌బన్స్ అడవుల మీదుగా తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశముంటుంది.
నేడు తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం - cyclone latest updates
తీవ్ర అల్పపీడనం గురువారం వాయుగుండంగా మారింది. పశ్చిమమధ్య బంగాళా ఖాతాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలవైపు కదులుతూ వెళ్తోందని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
నేడు తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం
నాగాలాండ్, మిజోరం, మణిపూర్, త్రిపుర, అసొమ్, మేఘాలయ, పశ్చిమబెంగాల్‌తో పాటు ఉత్తర ఒడిశా జిల్లాల్లో తీవ్ర ప్రభావం కనిపించవచ్చు.. ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. ఒడిశా నుంచి బంగ్లాదేశ్ తీరం వరకూ 24వ తేదీ వరకూ మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చదవండి