ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గేదెల్ని మేపేందుకు వెళ్లాడు.. చెరువులో శవమై తేలాడు - పాపయ్యపాలెం చెరువులో వ్యక్తి అనుమానాస్పద మృతి వార్తలు

గేదెలను కాయడానికి వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై తేలిన ఘటన విశాఖ జిల్లా పాపయ్యపాలెంలో జరిగింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది.

a perosn doubuful death at paapayyapalem in vizag district
చెరువులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

By

Published : May 9, 2020, 2:13 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పాపయ్యపాలెంలోని చెరువులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మొల్లి వెంకట్రావు అనే వ్యక్తి గేదెలను మేపడానికి ఇంటి నుంచి వెళ్ళాడు. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చిన గ్రామస్థులు వెళ్లి చూడగా చెరువులో శవమై కనిపించాడు.

వారు పోలీసులకు సమాచారమిచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. అనకాపల్లి గ్రామీణ ఎస్సై రామకృష్ణారావు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details