MLA Anam Sensational Comments: మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటున్నారు.. అవే వస్తే తామంతా ముందే ఇంటికి వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడం లేదని మండిపడ్డారు. ‘‘ప్రజలు వైకాపాకు అధికారం ఇచ్చి నాలుగేళ్లు అవుతోంది. ఇంకా సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇందుకు సాంకేతిక కారణాలా? బిల్లుల చెల్లింపు జాప్యమా? తెలియడం లేదు’’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముందస్తుకెళ్తే మునుగుడే.. ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు.. జగన్ సీరియస్
MLA Anam Sensational Comments: మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటున్నారు.. అవే వస్తే తామంతా మునుగుడు ఖాయమని అన్నారు. పార్టీపై వరుస ఆరోపణలు చేస్తుండడంతో ఆనంపై అధిష్టానం దృష్టి సారించింది. ఆనంపై ఆగ్రహంగా ఉన్న సీఎం జగన్... చర్యలకు సిద్ధమయ్యారు.
ఆనం తొలగింపు..!: ఇదిలావుంటే ప్రభుత్వంపై వరుస ఆరోపణలు చేస్తున్న ఆనంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఆనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పార్టీ ప్రకటించింది. జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి ప్రాధాన్యతను తగ్గించేలా పార్టీ చర్యలు తీసుకుంది. నియోజకవర్గ ఇన్చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాలను పాటించాలని అధికారులకు పార్టీ ముఖ్య నేతల నుంచి ఆదేశాలు వెళ్లాయి.
ఇవీ చదవండి