Rain water entered into the school: తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిట్టమూరులోని ప్రభుత్వ పాఠశాల, బీసీ హాస్టల్లో వర్షపు నీరు చేరి స్కూలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల వల్ల ప్రజలకు వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెబుతున్న అధికారుల మాటలు మాటలకే పరిమితం అవుతున్నాయని.. ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఈ సమస్యను అధికారులకు చూపించేందుకు వీడియో తీసి పంపించారు. ఎప్పుడు వర్షం వచ్చినా.. సమస్య ఇలాగే ఉంటుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షపు నీరు వెళ్లే విధంగా చర్యలు చేపట్టి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
రెండు రోజులుగా భారీ వర్షాలు.. విద్యార్థులకు ఇబ్బందులు
Rain water entered into the school: వర్షాలు పడితే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. పిల్లలు, పెద్దలు అందరూ అవస్థలు ఎదుర్కొంటారు. అలాగే తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో ఉన్న పాఠశాల వర్షం నీటితో మునిగిన కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పాఠశాలోకి చేరిన వర్షపు నీరు