ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీవ్రతుఫానుగా మారిన మాండూస్..

Cyclone Mandus: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా బలపడిన మాండూస్.. ప్రస్తుతానికి చెన్నైకి 440 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఏండీ తెలిపింది. శుక్రవారం తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులతో, భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Cyclone Mandus
మాండూస్ తుఫాను

By

Published : Dec 9, 2022, 7:15 AM IST

Cyclone Mandus: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా బలపడిన మాండూస్..ఈ ఉదయం నుంచి క్రమంగా బలహీనపడనుందని ఐఏండీ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న తుపాను.. శుక్రవారం అర్ధరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం దాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

తుపాను ప్రభావంతో రెండురోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలినచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రస్తుతానికి తీవ్రతుపానుగా బలపడిన మాండూస్.. చెన్నైకి 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details