Dharmana Prasada Rao: రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను అందించడం.. తమ ప్రభుత్వ ఘనతని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తిరుపతిలో నిర్వహించిన రాయలసీమ జిల్లాల ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సదస్సులో ఎనిమిది జిల్లాలకు సంబంధించిన పాలనాధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల కోసం రూ.12 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు ఆయన తెలిపారు. చుక్కల భూమి, అసైన్డ్ భూమి, 22ఏ సమస్యలు, రీ సర్వే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిచ్చిన ఘనత మాది: మంత్రి ధర్మాన ప్రసాదరావు - Thirupati District News
Dharmana Prasada Rao: రాష్ట్రంలో పేద ప్రజలకు భూమి అందేలా చూడాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు అసమ్మతి పెంచేలా ప్రతిపక్షం చూస్తోందని ఆయన ఆరోపించారు.
ధర్మాన ప్రసాదరావు
పేద ప్రజలకు భూమి చేర్చాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని అన్నారు. ప్రభుత్వంపై అసమ్మతి పెంచేలా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. నిష్పక్షపాతంగా పని చేసే అధికారులకు అండగా ఉంటామని తెలిపారు. మొట్టమొదటి ప్రాంతీయ రెవెన్యూ సమావేశం తిరుపతిలో నిర్వహిస్తున్నామని.. త్వరలో విశాఖ, విజయవాడలో కూడా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇవీ చదవండి: