Gudur Narayana Engineering College: తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి తల్లిదండ్రులు త్రీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు నిలిచాయి. నారాయణ కాలేజీ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ధరణేశ్వర్ రెడ్డిది ఆత్మహత్య కాదని.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుని కుటుంబ సభ్యులు కాలేజీ హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు.
హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు..: విద్యార్థి తల్లిదండ్రుల ఆవేదన
Gudur Narayana Engineering College: తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజీ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థి కుటుంబ కలహాలతో మరణించినట్టు పోలీసులు పేర్కొనడంతో.. విద్యార్థి తల్లిదండ్రులు కుటుంబ కలహాలేమీ లేవని పోలీసులే కేసు తప్పుదారి పట్టించారని ఆరోపణలు చేస్తున్నారు.
Gudur Narayana Engineering College
హాస్టల్లోకి వెళ్లి అద్దాలను పగలగొట్టి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను అడ్డుకున్నారు.. ఫీజుల విషయంలో యాజమాన్యం వేధించినట్టు.. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో కూడా నమోదైనట్లు చెబుతున్నారు. విద్యార్థి కుటుంబ కలహాలతో మరణించినట్టు పోలీసులు పేర్కొనడంతో విద్యార్థి తల్లిదండ్రులు తమ కొడుకు ఎంతో సౌమ్యుడని.. కుటుంబ కలహాలేమీ లేవని.. పోలీసులే కేసు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
ఇవీ చదవండి: