శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని వేరుఘట్టంలో ఏర్పాటు చేసిన వలస కూలీల వసతి కేంద్రంలో... యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ నివాస్ ప్రత్యేక చొరవతో కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. నిత్యం ఉదయం గంట సమయం యోగా తరగతులను.. వ్యాయామ ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి చెరుకు కోత కోసం వచ్చిన 100 మంది కూలీలు.. లాక్డౌన్ కారణంగా ఇక్కడ చిక్కుకోగా.. వసతి కేంద్రాల్లో వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
వలస కూలీలకు యోగా తరగతులు
కూలీ కోసం వలస వచ్చిన వారంతా లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. అధికారులు వారికి వసతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆరోగ్య పరిరక్షణ దిశగా.. వారు ఉన్న ప్రాంతాల్లోనే యోగా తరగతులు నిర్వహిస్తున్నారు.
Yoga classes for prakasham migrant workers at Verughattam in srikakulam