ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు కోసం సభాపతితో మహిళలు వాగ్వాదం - రోడ్డు కోసం సభాపతి తమ్మినేనితో మహిళలు వాగ్వాదం

శాసన సభాపతి తమ్మినేని సీతారామ్​కు నిరసన సెగ తగిలింది. ఆమదాలవలస గేటు వద్ద నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనతో మహిళలు వాగ్వాదానికి దిగారు. బీఆర్​ నగర్​కు చెందిన పలువురు మహిళలు..రోడ్డు కోసం నిలదీశారు.

speaker tammineni sitaram
speaker tammineni sitaram

By

Published : Dec 30, 2020, 4:49 PM IST

రోడ్డు కోసం సభాపతితో మహిళలు వాగ్వాదం

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గేటు వద్ద నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారాంతో కొందరు మహిళలు వాగ్వాదానికి దిగారు. బీఆర్ నగర్​కు చెందిన మహిళలు.. రోడ్డు కోసం ఆయన్ను నిలదీశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. స్పందించిన సభాపతి.. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలని వారికి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details