Civil Supplies Agency review meeting : రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన వరి పంటకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు... వారు సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పౌర సరఫరాల సంస్థ వైస్ ఛైర్మన్ వీరపాండ్యన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్న పౌరసరఫరాల సంస్థ ఎండీ.. అందులో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మరియు ఏపీ మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.
'ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం'
Civil Supplies Agency review meeting : రైతులను సంతోషంగా చూడాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పౌర సరఫరాల సంస్థ వైస్ ఛైర్మన్ వీరపాండ్యన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్న పౌరసరఫరాల సంస్థ ఎండీ.. అందులో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, ఏపీ మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 9 వందల రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయన్న వీరపాండ్యన్... ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఒక్క గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇందులో అధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నులు, తూర్పు గోదావరి జిల్లాలో లక్షన్నర మెట్రిక్ టన్నులు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఎండీ చెప్పారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభమయినందున వచ్చే నెలలో ఇక్కడ కూడా ఎక్కువ సంఖ్యలో ధాన్యం వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు చేయనున్న 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ 10వేల కోట్ల రూపాయలకు పైబడి ఉన్నందున దీనికి కనీస మద్దతు ధరను కల్పించాలని.. రైతులు ఎక్కడా నష్టపోరాదని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కృషిచేస్తుందన్నారని పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి