ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంటల్లో కారు.. తప్పిన ప్రమాదం

శ్రీకాకుళం జిల్లా అల్లినగరంలో రహదారిపై కారు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడగా.. కారు పూర్తిగా దగ్ధమైంది.

The car caught on fire at allinagaram srikakulam
మంటల్లో చిక్కుకున్న కారు

By

Published : Apr 5, 2020, 12:06 PM IST

కారు నేర్చుకోవాలనే సరదా ప్రాణం పైకి తెచ్చిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం అల్లినగరంలో జరిగింది. గ్రామానికి చెందిన ఒక వక్తి కారు నేర్చుకునేందుకు కొందరు యువకులతో కలిసి జాతీయ రహదారిపైకి వచ్చాడు. ఆ యువకులను రోడ్డుమీదే ఉండమని చెప్పి ఒక్కడే కారు తీసుకు వచ్చేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అదుపు తప్పి రహదారి ప్రక్కన ఉన్న కల్వర్టును కారు ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకోగా.. కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ABOUT THE AUTHOR

...view details