శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో తెదేపా నేత కూన రవికుమార్ నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ గోండు రమణ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి వాటిని అందజేశారు. రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కొవిడ్‌పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైందో చిన్నపిల్లలను అడిగినా చెప్తారని.. అలాంటిది సీఎం దాన్ని మామూలు జ్వరంలాంటిదే అనడం విడ్డూరంగా ఉందన్నారు.
'చిన్నపిల్లలను అడిగినా చెప్తారు... సీఎంకు తెలియదా..?' - సీఎం జగన్‌పై కూన రవికుమార్ విమర్శలు
కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైందో పిల్లలను అడిగినా చెప్తారని.. అలాంటిదాన్ని సీఎం జగన్ జ్వరంతో పోల్చడం విడ్డూరంగా ఉందని తెదేపా నేత కూన రవికుమార్ ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా బొబ్బిలిపేటలో ఆయన నిత్యావసరాలు పంపిణీ చేశారు.
కూరగాయలు పంచిన తెదేపా నేత కూన రవికుమార్