ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 10, 2020, 2:56 PM IST

ETV Bharat / state

అరసవల్లిలో భాస్కరుడిని తాకిన సూర్యకిరణాలు

ప్రత్యేక్ష దైవమైన ఆ భాస్కరుడి కిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్‌ను తాకే అద్భుత ఘట్టం ఈరోజు ఆవిష్కృతమైంది. దీంతో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి క్షేత్రం సూర్యభగవానుడి నామస్మరణతో మారుమోగింది.

Arasavalli suryanarayana swamy
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్‌ను తాకిన సూర్యకిరణాలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్‌ను ఈరోజు కూడా బంగారు వర్ణంలో ఉన్న లేలేత కిరణాలు తాకాయి. సూర్యకిరణాలు ఆదిత్యుని చేరి.. స్వామివారి పాదాలను నుంచి.. శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం 9 నిమిషాల పాటు ఆవిష్కృతమైంది. ఉత్తరాయనం, దక్షిణాయనం మార్పుల్లో ఈ కిరణ స్పర్శ భాస్కరుని తాకుతుంది. ఏటా మార్చి 9,10 తేదిల్లో... మరలా అక్టోబర్ 1, 2 తేదీల్లో ఈ దృశ్యం భక్తులకు కనువిందు చేస్తోంది. ఈ సారి ఉత్తరాయంలో రెండు రోజులపాటు కిరణాలు స్వామివారి పాదాలను తాకడం భక్తుల అనందం వ్యక్తం చేస్తున్నారు.

అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్‌ను తాకిన సూర్యకిరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details