ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిక్కోలు క్రీడలకు పుట్టినిల్లు: మంత్రి ధర్మాన

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో... సౌత్‌ జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయ ఖోఖో మహిళా ఛాంపియన్​షిప్ పోటీలను... మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా... సిక్కోలు క్రీడలకు పుట్టినిల్లుగా మంత్రి ధర్మాన అభివర్ణించారు.

సౌత్‌ జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయ ఖోఖో పోటీలను ప్రారంభించిన మంత్రులు

By

Published : Oct 4, 2019, 6:11 AM IST

శ్రీకాకుళం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో సౌత్‌ జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయ ఖోఖో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, ముత్తంశెట్టి శ్రీనివాసరావు క్రీడలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న పోటీల్లో... తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన 60 విశ్వవిద్యాలయాల నుంచి ఎనిమిది వందలకు పైగా మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు.


దేశభక్తికి క్రీడలే కీలకం
దేశ భక్తిని పెంపొందించడంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని క్రీడల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. క్రీడలు కుల, మతాలకు అతీతమని... దేశం యావత్తు క్రీడాకారులకు అండగా నిలుస్తుందన్నారు.


క్షేత్రస్థాయినుంచే క్రీడల ఆదరణకు చర్యలు
సిక్కోలు క్రీడలకు పుట్టినిల్లుగా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అభివర్ణించారు. జిల్లా నుంచి చక్కని ఆతిథ్యం పొంది మధుర స్మృతులతో వెళ్లాలని క్రీడాకారులకు సూచించారు. గ్రామస్థాయి నుంచే క్రీడలకు ఆదరణ పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

సౌత్‌ జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయ ఖోఖో పోటీలను ప్రారంభించిన మంత్రులు


ఇదీ చూడండి: శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన పర్యటన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details