అధికంగా బిల్లు వస్తే తక్షణమే తన కార్యాలయానికి రావాలని.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస విద్యుత్ ఏడిఈ సురేష్.. ప్రజలను కోరారు. అనవసరంగా ఆందోళన చెందవద్దన్నారు.
సబ్ డివిజన్ పరిధిలో ఉన్న సరుబుజ్జిలి, ఆమదాలవలస పురపాలక సంఘం, ఆమదాలవలస మండల ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులు.. బిల్లుల పరంగా ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.