ఆసుపత్రి భవనంపై నుంచి ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శనివారం జరిగింది. శివశంకర్ కాలనీకి చెందిన గోరుశెట్టి శ్రీను (40) అనే వ్యక్తి రజక వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా పనుల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటీవల పచ్చకామెర్లతో బాధపడ్డాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఇంట్లో శుభకార్యం ఉండడంతో.. మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతానని ఆందోళ చెందినట్లు అతని భార్య శ్రీదేవి చెప్పింది.
Srikakulam: ఆసుపత్రి భవనంపై ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య! - ఉరి
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఆసుపత్రి భవనంపై ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని మృతిని భార్య తెలిపింది.
ఆత్మహత్య
శుక్రవారం రాత్రి 7 తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, శవమై తిరిగొస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలిపింది. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు నమోదు చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనుకు భార్య శ్రీదేవి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
ఇదీ చదవండి:కుమారునితో భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య