శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాడివలస గ్రామంలో సుమారు రూ.21.80 లక్షల నిధులతో గ్రామ సచివాలయం, రూ.21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. లచ్చయ్యపేట గ్రామంలో రూ.25 లక్షల నిధులతో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. గత ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని.. అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో జనం సముద్రమై కదిలారని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వంలో పెన్షన్ కోసం జన్మభూమి కమిటీల దగ్గరికి కాళ్లరిగేలా తిరిగేవాళ్లని... ఇప్పుడు వాలంటీర్లు ఇంటివద్దకే తెచ్చి ఇస్తున్నారని స్పీకర్ పేర్కొన్నారు. పాలన ప్రజల ముందుకు తెచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన రేల్లిగడ్డ పనులలో భారీ అవకతవకలు జరిగాయని.. సుమారు రూ.16 కోట్లు అవీనీతి జరిగిందని ఆరోపించారు.