సంతకవిటి మండలం జానకిపురం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. సుమారు పది లక్షల వరకు ఆస్తి నష్టమైందని గ్రామస్థులు చెబుతున్నారు. అందరూ పొలం పనులు చేసుకునేందుకు వెళ్లిన తర్వాత.. మిట్టమధ్యాహ్నం ప్రమాదం జరిగింది. దీంతో ఇళ్లల్లో ఉన్న విలువైన వస్తువులు, బట్టలు, ముఖ్యమైన పత్రాలు, నగదు అగ్నికి ఆహుతయ్యాయి.
ఆరు పూరిళ్లు దగ్ధం.. పది లక్షల ఆస్తి నష్టం! - huts burnt news
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం జానకిపురం గ్రామంలో ఆరు పూరిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు పది లక్షల ఆస్తి నష్టం జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
అగ్ని ప్రమాదం వల్ల దగ్దమైన పూరిళ్లు
గ్రామానికి చెందిన గునుపూరు సన్యాసమ్మ, పాండ్రంకి రాజారావు, తవిటి నాయుడు, వెంకి నాయుడు, ఆదిలక్ష్మి, మల్లేశ్‌కు చెందిన పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:శ్రీకాకుళంలో రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా ర్యాలీ