మొన్నటివరకు కరోనా కేసులు లేని శ్రీకాకుళం జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదుకావడంపై విజయనగరం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలోని గుమ్మలక్ష్మీపురం చెక్‌పోస్టును ఓఎస్డీ మోహనరావు, ఏఎస్పీ బిందుమాధవ్ తనిఖీ చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని అక్కడి అధికారులకు సూచించారు. అత్యవసర వాహనాలు తప్ప వేరే వాటిని అనుమతించవద్దని ఆదేశించారు.
విజయనగరంలో లాక్డౌన్ మరింత కఠినం - osd visit gummalakshmipuram checkpost vizianagaram news
విజయనగరంలో లాక్‌డౌన్‌ను అధికారులు కఠినతరం చేశారు. శ్రీకాకుళంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఓఎస్డీ మోహనరావు చెక్‌పోస్టులు తనిఖీ చేశారు.
గుమ్మలక్ష్మీపురం చెక్ పోస్టును తనిఖీ చేసిన ఓఎస్డీ మోహనరావు
TAGGED:
విజయనగరంలో కరోనా వార్తలు