తమకు 2019 ఆగస్టు నుంచి రావలసిన మెడికల్ హెల్త్ అలవెన్స్‌ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. దీనిపై సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమణారావు మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వీరిని అభినందిస్తున్నారు కానీ.. వీరికి కనీస వేతనాలు కానీ, ఇతర భద్రతా సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. కార్మికులకు కావల్సింది పొగడ్తలు, సన్మానాలు కాదనీ.. వారు చేసే పనికి జీతాలు సక్రమంగా చెల్లించడమే వారికి చేయూతనిస్తుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
'వారికి కావల్సింది.. పొగడ్తలు, సన్మానాలు కాదు' - పాలకొండలో పారిశుద్ద్య కార్మికుల ధర్నా
పారిశుద్ధ్య కార్మికులకు కావల్సింది పొగడ్తలు, సన్మానాలు కాదనీ.. వారు చేసే పనికి తగిన వేతనం ఇవ్వడమే వారు కోరుకుంటున్నారని.. శ్రీకాకుళం జిల్లా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమణారావు అన్నారు. మెడికల్ అలవెన్స్ వెంటనే చెల్లించాలని కోరుతూ పాలకొండలో మున్సిపల్ కార్మికులతో కలిసి ధర్నాకు దిగారు.

పారిశుద్ధ్య కార్మికుల ధర్నా