శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పరిధిలోని 18 గ్రామాలను రెడ్ జోన్ ప్రాంతాలుగా గుర్తించారు. జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రత చర్యలను మరింత పటిష్టం చేశారు. రెడ్ జోన్ ప్రాంతాలవారు బయటకు రావొద్దని.. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తామని కలెక్టర్ నివాస్ తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: రెడ్ జోన్లుగా 18 గ్రామాలు
మొన్నటి వరకూ కరోనా రహిత జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలోనూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. పాతపట్నం మండల పరిధిలోని 18 ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు.
పాతపట్నం పరిధిలో 18 రెడ్ జోన్ ప్రాంతాలు