రథసప్తమికి ముస్తాబైన అరసవల్లి - ARASAVALLI
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి.
అరసవల్లి సూర్యనారాయణాలయం
ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్య భగవానుడి దర్శనం కల్పించనున్నారు. రథసప్తమి నాడు సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యమివ్వనున్నారు. ఉచిత దర్శనంతో పాటు 100, 500 రూపాయల టికెట్లు అందుబాటులో తెచ్చారు భక్తుల రద్దీ దృష్ట్యా ప్రధాన రహదారి నుంచి ఆలయ ముఖద్వారం వరకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. లక్ష లడ్డూలను సిద్ధం చేశారు.