శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పరిధిలోని బుడుమూరు పెద్దగెడ్డకు అనుకొని ఉన్న రాయిలింగారిపేట సమీపంలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇసుక తవ్వకాలు చేస్తున్న జెసీబీ, 10 ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిని లావేరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. అనంతరం 12 గంటల తరువాత ట్రాక్టర్లుకు సంబంధించి రణస్థలం మండల పంచాయతీ కార్యదర్శులు ఇచ్చిన అనుమతులు చూపించాక.. వాటిని విడిచిపెట్టారు. రణస్థలం మండల అధికారులు తవ్వకాలకు సంబంధించి ఇష్టారాజ్యంగా అనుమతులు మంజూరు చేయడంతో కొంత మంది బడాబాబులు ఇదే అదునుగా చేసుకొని.. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. రణస్థలం మండలం నాయకులు లావేరు మండలంలోని ఇసుక తరులించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడ్డగోలుగా ఇసుక బిల్లుల మంజూరు..అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పరిధిలో ప్రజా ప్రతినిధులు .. అధికారులతో బిల్లులు మంజూరు చేయించుకుని ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. రాయిలింగారిపేట సమీపంలో ఇసుక తవ్వకాలు చేస్తున్న జెసీబీ 10 ట్రాక్టర్లను ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు.
రాయిలింగారిపేటలో ఇసుక అక్రమ రవాణా
ఇదీ చూడండి.సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం