ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పటిష్టంగా నిఘా పెట్టారు.. పక్కాగా కట్టడి చేశారు!

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై.. పోలీసుల నిఘా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. గంజాయి, అక్రమంగా ఇసుక తరలింపు, జూదం వంటి ఘటనలపై ఖాకీలు కఠినంగా స్పందించారు. తప్పు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి చర్యలు సహించేది లేదని హెచ్చరించారు.

police rides on illegal activities in the state
అక్రమ రవాణాపై దాడులు

By

Published : Jun 13, 2021, 9:28 AM IST

విశాఖ నుంచి చెన్నైకి తరలిస్తున్న 120 కిలోల గంజాయిని మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజా టోల్ గేట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఈ దందాను గుర్తించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

ట్రాక్టర్లు సీజ్

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో బహుదానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

పేకాట కేంద్రాలపై దాడి.. 16 మంది అరెస్ట్

అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని ఈచలడ్డి, బి.రాయపురం గ్రామాల్లోని జూద కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 16 మందిని అదుపులోకి తీసుకుని... రూ.40,790 స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

అనాథనంటూ వల.. మూడో పెళ్లి చేసుకుని 6 లక్షలతో ఉడాయించిందిలా..!

ABOUT THE AUTHOR

...view details